కన్నడ హీరో యష్ స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ఆతనితో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, బడా నిర్మాతలు క్యూలు కడుతున్నారు. అతని మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు. యష్ ఇంత స్టార్ డమ్ సంపాదించడానికి కారణం ‘కెజిఎఫ్’ చిత్రమే. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ‘కెజిఎఫ్’ చిత్రానికి ఒక మాదిరి పారితోషకమే తీసుకున్న యష్ ‘కెజిఎఫ్-2’ మాత్రం భారీగానే పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 50 కోట్లకు పైగానే పారితోషకం రూపంలో అందుకున్నాడు యష్.
నిజానికి యష్ ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. డబ్బు విలువ ఏంటో అతనికి బాగా తెలుసు. అందుకే వచ్చిన డబ్బును దుబారా చేయకుండా భూముల మీద పెడుతున్నాడు. ఇటీవలే ఆయన బెంగుళూర్ శివార్లలో ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేశారట. అది చిన్నదేమీ కాదు. కొద్దిగా భారీ లేవల్లోనే ఉంది. ప్రస్తుతం ‘కెజిఎఫ్ 2’ షూటింగ్ పూర్తికావడం, వేరే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలుపెట్టే పరిస్థితి లేకపోవడంతో యష్ కొత్తగా కొన్న ఫామ్ హౌస్ కు చేరుకొని వ్యవసాయం మొదలుపెట్టారు. భూమిని చదును చేసి పండ్ల తోటలు వేయడానికి సిద్ధం చేస్తున్నాడట.