RRR : ఇన్సైడ్ టాక్ : “RRR” తరహాలో “కేజీఎఫ్ 2” కి నెవర్ బిఫోర్ ప్లానింగ్స్.?

RRR : వచ్చే ఏడాది ఇండియన్ సినిమా దగ్గరకి రాబోతున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో జనవరిలోనే రిలీజ్ కి రెడీగా ఉన్న ట్రిపుల్ ఆర్ (RRR) ఒకటి కాగా మరొకటి ఏప్రిల్ నెలలో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”. ఈ రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ ని దుమ్ము లేపే సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.

మరి వీటిలో ట్రిపుల్ ఆర్ ని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించగా కేజీఎఫ్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. మరి ఈ రెండు సమాన స్టార్డం ఉన్న చిత్రాలు బిగ్ స్క్రీన్ పై ఎలాంటి విజువల్ ట్రీట్ ని ఇస్తాయా అని అంతా ఆసక్తిగా చూస్తుండగా ఆ ఆసక్తిని అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా బృందాలు ప్లాన్ చేస్తున్నారు.

మొదటగా అయితే రాజమౌళి తన సినిమాని మంచి ఎక్స్ పీరియన్స్ కోసం 3డి లో రిలీజ్ చేస్తున్నట్టు ఎక్కడా అనౌన్స్ చెయ్యలేదు కానీ మొన్న ట్రైలర్ తో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఇదే 3డి రిలీజ్ ప్లాన్ ని కేజీఎఫ్ బృందం కూడా ఆ సినిమా తరహాలోనే ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతానికి ఈ టాక్ కన్నడ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. ఇంకా టైం ఉంది కాబట్టి ముందు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ విలన్ గా నటించాడు. అలానే ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు నటించారు.