AP: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్… తల్లిదండ్రులు వీటిని సిద్ధం చేసుకోండి?

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ పథకాలను ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేకపోతోంది అంటూ విమర్శలు వస్తున్న తరుణంలో మరొక పథకాన్ని అమలు చేయటానికి ఏపీ సర్కార్ సిద్ధమైందని తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అంటూ ఒకసరి కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో చదువుతున్న ఒక బిడ్డకు నేరుగా తల్లి అకౌంట్ లో 15000 రూపాయలు వేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ఇదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ పథకం ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. అందుకుగాను విద్యార్థుల తల్లితండ్రులు కొన్ని సర్టిఫికెట్లను కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు NPCI తో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదే విషయాన్ని అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రాసెస్ సచివాలయంలోను, బ్యాంక్, దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి లింక్ చేయించుకోవచ్చు. జూన్ 5లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకుంటేనే తల్లుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. అలాగే విద్యార్థులు 75% హాజరు పట్టిక ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ తో పాటు అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్ వంటి సర్టిఫికెట్లను కూడా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. స్కూల్ ప్రారంభమైన రోజు ఈ పథకం కూడా అమలు కానుందని వార్తలు వస్తున్నాయి.