Kethi Reddy: వైసీపీలో కీలక ప్రాతినిధ్యం వహించినటువంటి సాయి రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా రాజకీయాలకే రాజీనామా చేస్తున్నానని ఇకపై తాను వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ ఉంటానని సాయి రెడ్డి రాజీనామా చేశారు. ఇక ఈయన రాజీనామా గురించి ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ముఖ్యము అంటూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ నుంచి వెళ్లిపోయినటువంటి వారందరూ కూడా స్పందిస్తూ తమకు క్యారెక్టర్ ఉందంటూ చెప్పుకు వస్తున్నారు. ఇకపోతే విజయ్ సాయి రెడ్డి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తనకు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎవరి ప్రలోభాలకు లొంగకుండా భయపడకుండా పార్టీకి రాజకీయాలకు రాజీనామా చేసి బయటకు వచ్చాను అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇలా సాయి రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన కౌంటర్ పై ధర్మవరం మాజీ వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కనుక ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు చేశాడు. పార్టీలో గొప్పగౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో చెప్పాడని, దాన్ని మాట్లాడ్డం అంటే, వైయస్.కుటుంబం యొక్క పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటూ పోస్ట్ చేశారు.
ఇలా విజయసాయిరెడ్డి గురించి కేతిరెడ్డి చేసిన ఈ పోస్టు పై విజయసాయిరెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా విజయ్ సాయి రెడ్డి వైసీపీలో ఎంతో కీలకంగా ఉంటూ ఒక్కసారిగా రాజీనామా చేయటంతో వైసిపి నేతలకు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి.