కేసీఆర్ తీరు చాలా మారింది. గతంలో ఎవ్వరినీ లెక్కచేయని ఆయన ఇప్పుడు అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. ఉదయం బలంతో తిరుగులేని నాయకుడిని అయిపోయాను ఇక ఎదురులేదు అనుకుంటుండగా తగిలిన వరుస ఎదురుదెబ్బలు ఆయన్ను మార్చేశాయి. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబద్ ఎలక్షన్లలో బీజేపీ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఆయన్ను ఆకాశం నుండి కిందకు దిగొచ్చేలా చేసింది. బీజేపీ దెబ్బకు గ్రౌండ్ లెవల్ రియాలిటీ మీద దృష్టి పెట్టారు కేసీఆర్. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేశారు. వారిని శాంతిపజేయడానికి నానారకాలుగా ట్రై చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భారీ ఆఫర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ప్రగతి భవన్ నందు ఉన్నతస్థాయి సామవేశం నిర్వహించిన ఆయన 13న ఉధ్యోగ సంఘాల నేతలతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు, ఫిట్ మెంట్ సహా పలు అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఫిట్ మెంట్, పదవీ విరమణ వయస్సు పెంపుపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే : నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్.
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని ప్రకటించేశారు. వీటికి తోడు ఉపాద్యాయ పోస్టుల ఖాళీలను కూడ భర్తీ సీయెడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి కేసీఆర్ ఉద్యోగుల విషయంలో మాత్రం చేతికి ఎముక లేదన్నట్టు వ్యవహరించాలనే ధోరణిలో ఉన్నారు.