వాళ్ళందరికీ ఫోన్లు చేస్తోన్న కే‌సి‌ఆర్ – ఎందుకంటే.. 

KCR trying to impess government employees
తెరాస అధినేత కేసీఆర్ కు ఎన్నిక ఏదైనా ముందు సర్వేలు చేయించుకోవడం అలవాటు.  ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఆ విష్యం మీద జనం అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళేం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవడం కోసం సర్వేలు చేయించుకుంటుంటారు ఆయన.  ఆ సర్వీల ఫలితాలను బట్టే ముందుకు వెళ్ళాలా వద్దా, ఒకవేళ ముందడుగు వేయాల్సి వస్తే ఎలా వేయాలి అనే విషయమై ఒక అంచనాలు వస్తుంటారు.  అంతేకాదు ఒక పని చేశాక దాని తాలూకు ప్రభావం ప్రజల మీద ఎలా ఉంది.  ప్రజలు ఏమనుకుంటున్నారు, చేసిన పనికి ఏమైనా ప్రయోజనం దక్కుతుందా లేదా అనేది తెలుసుకుంటుంటారు.  ఒక్కోసారి ఆయనే నేరుగా ఫోన్లు చేసి అభిప్రాయాలను తెలుసుకుంటారు.  
 
KCR trying to impess government employees
KCR trying to impess government employees
ఈమధ్య ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగలడంతో మరింత అప్రమత్తమైన ఆయన అసంతృప్త వర్గాల మీద ఫోకస్ పెట్టారు.  ముఖ్యంగా ఉద్యోగుల మీద దృష్టి కేంద్రీకరించారు.  వారి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేవి కూపీ లాగుతున్నారు.  ఈ క్రమంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు, ఫిట్ మెంట్లు ఇవ్వడానికి సిద్ధమంటున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులలు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపును ఇవ్వనున్నారు. 
 
 
ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల మీద దృష్టి పెట్టారు.  ఉద్యోగుల్లో ఎంతమంది పదోన్నతులు కోరుకుంటున్నారు, వాటిని పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు   చేస్తున్నారు, ఈ క్రమంలో వారికి ఎదురవుతున్న సమస్యలు ఏంటి అనేది వాకబు చేస్తున్నారు.  నేరుగా వారికే ఫోన్లు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.  ముఖ్యమంత్రి నుండే నేరుగా ఫోన్ రావడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు.  రాకరాక సీఎంతో మాట్లాడే అవకాశం దొరకడంతో సాధకబాధకాలు చెప్పుకుంటున్నారు.  మొత్తానికి కేసీఆర్ మరోసారి ప్రజలకు దగ్గరయ్యే పనిలో నిమగ్నమయ్యారు.