తెలంగాణలో ఉన్న ప్రతి అంగుళం భూమి ఆన్ లైన్ లో నమోదు అవుతుంది. ప్రతి ఆస్తి ఆన్ లైన్ లో నమోదు అవుతుంది.. అని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు ఇంకా ఆన్ లైన్ లో నమోదు కాని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్లు, వ్యవసాయేత ఆస్తులను ఆన్ లైన్ చేస్తున్నట్టు సీఎం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరికొత్త చట్టాలు ప్రజలకు మేలు చేయడం కోసమే అని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ చట్టం అమలు చేసినా.. దాని ఫలితం అత్యంత నిరుపేదలకు అందడమేనన్నారు. చివరి గుడిసె వరకు ఫలితాలు అందేలా చూడటమే తమ లక్ష్యమన్నారు.
తెలంగాణకు సంబంధించిన ప్రతి భూమి వివరాల్లో పారదర్శకత ఉంటుందని.. దాని కోసమే ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ధరణి పోర్టల్ ద్వారా తమ భూమి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
భూములను క్రమబద్ధీకరించడం వల్ల వచ్చే ఆధాయంతో ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. భూముల క్రమబద్ధీకరణ వల్ల భవిష్యత్తులో ఆ భూమికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ భూమి మీద ఎటువంటి అక్రమాలు చేయడానికి కుదరదు.. దాని కోసమే భూములను క్రమబద్ధీకరిస్తున్నామని సీఎం తెలిపారు.