నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసారా? ఆ ఫోన్ కాల్ లో ఇరువురి మధ్య జరిగిన మాట మంతి ఏంటి? అసలు బాలయ్యకు ఫోన్ చేయాల్సినంత అవసరం ముఖ్యమంత్రికి ఏముంది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవలే సీఎం కేసీఆర్ తో టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు భేటీ అయి ఇండస్ర్టీ సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమకి వచ్చిన నష్టం, థియేటర్లు పున ప్రారంభించడం ఎలా? షూటింగ్ లకు అనుమతులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. అంతకు ముందు చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పులువురు సెలబ్రిటీలు భేటి అయ్యారు.
ఈ రెండు భేటీలకు బాలయ్యను ఆహ్వానించని నేపథ్యంలో ఆయన భూములు పంచుకోవడానికే అయింటుందని కామెంట్ చేసారు. ఆ మాటలు ఇండస్ర్టీ సహా రాజకీయాల్లోను పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. బాలయ్యకు ఉప్పందకుండా అలా కామెంట్ చేయరని కోందరంటే..అవి తెలిసి తెలియని ఏదో కోపంతా చేసిన వ్యాఖ్యలని ఇంకొందరు అన్నారు. ఇదంతా గతం. అయితే ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బాలయ్యు కు ఫోన్ చేసి భేటీలో జరిగిన చర్చకు గురించి చెప్పారుట. నీ పరంగా నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే చెప్పు అని అడిగారుట. అందుకు బాలయ్య తనకు తోచిన నాలుగు మాటలేవో చెప్పారుట.
ఆ తర్వాతే బాలయ్య శాంతించి కేసీఆర్ కు తనపై పుత్రవాత్సల్యం ఉందని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కేసీఆర్ బాలయ్యకు కాల్ చేయడానికి రెండు కారణాలు ప్రధానంగా ఉన్నాయంటున్నారు. ఒకటి స్వర్గీయ ఎన్టీరామారావుపై కేసీఆర్ కు ఉన్న అభిమానం, అనుబంధం ..బాలయ్య చిరంజీవి సమకాలీకుడు కావడంతోనే కేసీఆర్ ఆయన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అన్న విషయాన్ని పక్కనబెట్టి బాలయ్యకు కాల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎం? అన్నది తెలియాల్సి ఉంది.