ఢిల్లీ ముఖ్యమంత్రిని భేటీ అయిన కేసీఆర్..

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆయన ఢిల్లీకి చేరుకున్నాడు. ఇక ఈ సందర్భంగా ఆయన వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతల సమావేశాలతో బాగా బిజీగా గడుపుతున్నాడు. అంతే కాకుండా జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి పై చర్చలు కూడా చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో ఆయన తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక వీరి మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చండీఘడ్ కు వెళ్లనున్నారని తెలిసింది.