కొన్నేళ్ల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఎంత ప్రయత్నించినా బీజేపీ పుంజుకోలేని పరిస్థితి అప్పట్లో ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో అధికార పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ తెలంగాణలో బలహీనపడటానికి కేసీఆర్ కారణమనే సంగతి తెలిసిందే.
2014లో టీ.ఆర్.ఎస్. పార్టీకి కేవలం 64 సీట్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో టీ.ఆర్.ఎస్ పడిపోవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా అనుకున్నది సాధించడంలో కేసీఆర్ సక్సెస్ సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే మరింత మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే ఇదే సమయంలో బీజేపీ కూడా పుంజుకుంది. టీడీపీ, కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించకుండా ఉండి ఉంటే బీజేపీ పుంజుకునేది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి షాకిస్తానని కేసీఆర్ చెబుతుండగా మొదట తెలంగాణలో షాకిచ్చి చూపించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ బలపడితే టీ.ఆర్.ఎస్. పరిస్థితి ఏంటని మరి కొందరు కామెంట్లు చేస్తునారు.
టీ.ఆర్.ఎస్ బీజేపీని తక్కువగా అంచనా వేయడం మాత్రం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే క్లారిటీ లేకపోయినా టీ.ఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీ.ఆర్.ఎస్ పార్టీని విమర్శించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.