తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ఓ రాజకీయ పార్టీ తెరపైకి తీసుకొస్తున్నారన్న వార్త నిన్నటి నుంచి ఒక్కటే వైరల్ గా మారింది. నయా భారత్ పేరుతో దేశాన్నే శాషించేలా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు మీడియా కథనాలు వేడెక్కించాయి. బీజేపీ కి బుద్ది చెప్పాలనే కేసీఆర్ రాష్ర్టాన్ని వదిలేసి దేశ రాజధాని ఢిల్లీ నుంచి చక్రం తిప్పాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటికి ఏకం చేసి ఆ పార్టీకి గుణపాఠం చెప్పే దిశగా కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. టీఆర్ ఎస్ శ్రేణుల్లో సైతం ఈ టాపిక్ హాట్ టాపిక్ గా నలిగింది.
దీంతో ఇదంతా నిజమే అన్నంతగా ప్రచారం ఠారెత్తిపోయింది. మరి దీని వెనుక అసలు సంగతేంటి? కేసీఆర్ గల్లి రాజకీయాలు వదిలేసి ఢిల్లీ రాజకీయాలు చేసేంత ధైర్యం చేస్తారా? అంటే కేసీఆర్ అత్యంత సన్నిహిత వర్గాల నుంచి మరో వెర్షన్ వినిపిస్తోంది. టీఆర్ ఎస్ పార్టీ ఉండగా ఆయన మరో పార్టీని ఢిల్లీ లో ఎందుకు ఏర్పాటు చేస్తారని..ఒకవేళ చేయాలనుకుంటే తనకు సీఎం పీఠాన్ని కట్టబెట్టిన గులాబీ పార్టీతోనే ముందుకెళ్తారని..అంతకేగానీ కొత్త పార్టీ ఆలోచన ఎందుకు చేస్తారని సందేహాలు వ్యక్తం చేసారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రజల నుంచి వస్తోన్న వ్యతిరేకత..ముఖ్యంగా స్టూడెంట్స్ యూనియన్స్ నుంచి వస్తోన్న వ్యతిరేకత కాంగ్రెస్..బీజేపీ పార్టీల నుంచి బలమైన నాయకులు ఉద్భవించడం వంటి పరిస్థితుల నడుమ కేసీఆర్ ఢిల్లీ వెళ్తే తెలంగాణలో గులాబీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. గత ఎన్నికల్ని కూడా విశ్లేషించుకున్నట్లు పార్టీ వ్యక్తుల ద్వారా లీకైంది. అయినా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలంటే కేసీఆర్ వెంట ఎంత మంది వస్తారు? అన్న దానిపై కూడా సందేహాలు వ్యక్తం చేసారు. ఫెడరల్ ప్రంట్ తీసుకొచ్చిన గత అనుభవాన్ని కేసీఆర్ మర్చిపోలేదన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని…ఇలాంటి సమయంలో కొత్త పార్టీ స్థాపించేంత రిస్క్ తీసుకోరని వంటి కారణాలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ మనసులో ఏముందో.