సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు. దుబ్బాకలో కనీసం ప్రచారం వైపు కన్నెత్తి చూడని కేసీఆర్, గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ప్రచారానికి రావటం చూస్తుంటే ఈ ఎన్నికలను తెరాస ఎంత సీరియస్ గా తీసుకుందో తెలుస్తుంది. ఇక ఈ సభకు సంబంధించిన విషయాలను తెరాస సీనియర్ నేత కర్నె ప్రభాకర్ తెలియచేస్తూ 3గంటల వరకే కార్యకర్తలు స్టేడియం చేరుకోవాలి అని ఆయన సూచించారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని వెల్లడించారు. 14గేట్ల వద్ద పది మంది చొప్పున వాలంటీర్ లు ఉంటారు అన్నారు. సానిటైజ్ చేసి, మాస్కులు ఇచ్చి లోనికి పంపిస్తారు అని పేర్కొన్నారు. వివిఐపి లు సి గేట్ ద్వారా సభాస్థలికి రావాలి అని ఆయన సూచించారు. పార్కింగ్ మహబూబియా కాలేజ్ అని, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డి అండ్ ఈ గేట్ ద్వారా రావాలన్నారు.
ట్యాంక్ బండ్ నుంచి వచ్చేవారు జి గేట్ ద్వారా 14, 15ఎంట్రీ నుంచి లోనికి రావాలన్నారు. మెహదీపట్నం నుంచి వచ్చేవారు కూడా జి గేట్ ద్వారా 14, 15 ఎంట్రీ నుంచి రావాలి అని సూచించారు. ఎల్బీ నగర్, దిల్ సూక్ నగర్, ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వారికి గేట్ ఏ ద్వారా 16, 17 ఎంట్రీ ల నుంచి అనుమతిస్తారనారు. ముషీరాబాద్, అంబర్ పేట, హిమాయత్ నగర్ నుంచి వచ్చే వారు గేట్ ఎఫ్, ఎఫ్1, జీ గేట్ల ద్వారా 6,7,8,9 ఎంట్రీ ల నుంచి లోనికి వెళ్ళాలి అని కార్పొరేటర్లు, మీడియాకు బి గేట్ ద్వారా ఎంట్రీ అని చెప్పారు. ప్రధాన వేదిక మీద ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు కూర్చుంటారు అని పేర్కొన్నారు. రెండో స్టేజీ కళాకారుల కోసం అని అన్నారు. మరో స్టేజి ని అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసాం అని వివరించారు. పి ఎంట్రీ ద్వారా అభ్యర్థులు లోనికి రావాలి అని సూచించారు.
ఇప్పటికే నగరం మొత్తం మీద కేటీఆర్ రోడ్ షోలతో సుడిగాలి పర్యటన చేసి, తెరాస శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపాడు, ఇక ఫైనల్ టచ్ గా కేసీఆర్ నిర్వహించే సభతో ఒక్కసారి గ్రేటర్ ఎన్నికలు తెరాస జోష్ పెరగటం ఖాయమని, అదే విధంగా ఈ వేదిక మీద నుండే ఢిల్లీ నేతలను టార్గెట్ చేసుకొని సీఎం కేసీఆర్ గర్జించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన ఉన్నకాని అందుకు సీఎం కేసీఆర్ కు అనుమతి లభించని విషయం తెలిసిందే, దాని గురించి ఈ సభలో మాట్లాడే అవకాశం లేకపోలేదు.2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ సభలోనే కేసీఆర్ ఎన్నికల ప్రసంగం చేయబోతున్నాడు, కాబట్టి అనేక సంచలనలకు ఈ సభ వేదిక కాబోతుంది.