జగన్ మీద కోపం మోడీ మీద చూపిస్తున్న కే‌సి‌ఆర్ ? నవ్వుకుంటున్న జగన్ ?

YS Jagan to conduct press conference to give counter to KCR

 

రాజకీయాల్లో నమ్మకంగా ఉండే స్నేహితులు ఉంటారా అని ఆలోచిస్తే సమాధానం తట్టడం కష్టం.. ఎందుకంటే రాజకీయాలు రాచపుండులాంటివి అంటారు వీటి గురించి బాగా అర్ధం చేసుకున్న మేధావులు.. ఇక వైఎస్ జగన్ ఏపీకీ సీయం అయిన తర్వాత తెలంగాణ సీయం కేసీయార్‌తో బాగానే దోస్తాన్ చేశారు.. ఒక దశలో మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం ఏదైనా సరే ఇద్దరం కూర్చుని చక్కగా పరిష్కరించుకుందాం.. అంతే కానీ కారాలు మిరియాలు నూరుకుంటే పక్కోడికి ఛాన్స్ ఇచ్చినట్లని బాగా ముచట్లు జరిపి గిఫ్ట్‌లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు.. మరి వీరి స్నేహం బీటలు బారి ఎన్నినాళ్లు అయ్యిందో తెలియదు గానీ ఏపీ సీయం వైఎస్ జగన్ మీద కేసీయార్ గుర్రుగా ఉన్నాడనే వార్త మాత్రం ప్రచారంలోకి వచ్చింది.. విషయం ఏంటో పరిశీలిస్తే.. నీటి వివాదం అని తేలింది..

ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కరించడానికి అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలని నిర్ణయించుకున్నారట. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాలేశ్వరం, దేవాదుల, తుపాకుల గూడెం మొదలగు మొత్తం ఏడు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది. ఎగువలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదన చేస్తుంది..

మరి కేసీయార్ తక్కువ తిన్నాడా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, విభజన చట్టానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకమని తాము పాత ప్రాజెక్టుల నే రీడిజైన్ చేస్తున్నామని తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా వైఎస్ జగన్ జల వివాదాల విషయంలో తెలంగాణ జోలికి రాకుండా కేసిఆర్ ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇందుకు గాను పూర్తి డేటా తో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముందు తెలంగాణకి నీటి హక్కుల పై ఉన్న విషయాలను తెలియజేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.. ఏది ఏమైనా వైఎస్ జగన్ మీది కోపాన్ని కేంద్రం మీద చూపించే కేసీయార్‌ను చూసిన ఏపీ సీయం లోలోన నవ్వుకుంటున్నారట..