మోడీ చూపించిన బొమ్మకు పూర్తిగా మారిపోయిన గులాబీ బాస్…? ఇవిగో ఆధారాలు

modi kcr new

 సీఎం కేసీఆర్ ఎప్పుడైతే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చాడో అప్పటినుండి తెలంగాణ వ్యాప్తంగా తెరాస గొంతు మూగబోయింది. బీజేపీ నేతలు తెరాస అధినేతను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన కానీ కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడటం లేదు తెరాస నేతలు. ముఖ్యంగా కేసీఆర్ వ్యవహార శైలిలో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.

modi kcr new

 ముఖ్యంగా బీజేపీని ఇబ్బంది పెట్టె విధంగా ఎలాంటి చర్యలు కూడా కేసీఆర్ తీసుకోవటం లేదు. మొన్నటి దాకా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్‌లు ఎందుకివ్వాలన్న మనిషే.. తయారు చేసి పంపించమని అధికారులకు చెప్పారు. ధరణి విషయంలోనూ మొండి పట్టుదల చూపించిన ఈ పెద్దమనిషి.. ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఫాలో అవ్వమని చెప్పేశారు.. పైగా సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచన వచ్చినా.. వద్దని చెప్పేశారు. వీటన్నిటిని మించి ఆయన సొంత మీడియా వారికి బీజేపీకి గాని, మోదీ గారికి గాని వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు, వ్యాఖ్యానాలు చేయకండి నాయనా అని ఆదేశాలిచ్చాడంట. అదీ పరిస్ధితి.

 తనకు కావాల్సిన పనులను బీజేపీని నొప్పించకుండా ఏ విధంగా నెరవేర్చుకోవాలో అనే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ మేయర్ పదవి విషయంలో చాలా జాగ్రత్తగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మేయర్ ఎన్నికపై మాట్లాడాలని అసదుద్దీన్ ఒవైసీ అడిగినా.. అసలు అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదంట. మేయర్ పీఠం కోసం ఎంఐఎం మద్దతు తీసుకుంటే బీజేపీ కి మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావించి ఏకంగా మున్సిపల్ చట్టంలో చిన్న మార్పు చేసి దాని ద్వారా పీఠం చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు.

 మెజారిటీ స్థానాలు ఎవరికుంటే వారిదే మేయర్.. అంతేగాని సగం పైనా ఉండాలనే కండిషన్ లేదంట. ఇప్పటికే ఆ చట్టం చేసినట్లు తెలుస్తుంది. ఆ పేరు చెప్పి.. టీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం.. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని కమిషనర్ పిలుస్తారు. వారికే అప్పచెప్పి.. కౌన్సిల్‌లో ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పుడు గులాబీ పార్టీకి ఎక్కువ మంది సభ్యులు మద్దతు ఇవ్వగానే.. వారికే మేయర్ అని అనౌన్స్ చేసేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎక్కడా ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిన అవసరమే రాదు. దీనితో బీజేపీ ఆగ్రహానికి గురికావాల్సిన పని లేదని సీఎం భావించినట్లు తెలుస్తుంది. మొన్నటిదాకా తలగరేసిన కేసీఆర్, ఇప్పుడు పూర్తిగా లొంగిపోయినట్లు తెలుస్తుంది.