KCR: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఈయన చివరిగా గత బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీలోకి వచ్చారు అప్పటినుంచి తిరిగి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలో కెసిఆర్ పాల్గొనబోతున్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ గంట ముందే అసెంబ్లీకి చేరుకున్నారు.. ఇలా గంట ముందే అసెంబ్లీకి వచ్చిన ఈయన బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ భేటీల భాగంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కొన్ని దిశా నిర్దేశాలు చేశారు.అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు.
ఇకపోతే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి తనని పరామర్శించడంతో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గూడెం మహిపాల్ రెడ్డి.. తన తమ్ముడి పెళ్లికార్డును స్వయంగా కేసీఆర్ కు అందజేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా కేసీఆర్ ను కలిశారు. దీనిపై ఆయనే స్పందించారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆదినారాయణ వెల్లడించారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ ఆయన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.