కవిత గెలుపు కేసీయార్‌కు తలనొప్పిగా మారిందా.. ??

 

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అన్న విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి.. ఎప్పుడో భూమిపుట్టక ముందు నుండి ఉన్న పార్టీ కాంగ్రెస్.. దాని ముందు టీఆర్ఎస్ పిల్ల పార్టీ.. కానీ తెలంగాణాలో కాంగ్రెస్‌ను మూడు చెరువుల నీరు తాగిస్తుంది.. వచ్చిన ఎన్నికల్లో గులాభికి పోటీగా దిగుతూ పరువు తీసుకోవడం తప్పితే కాంగ్రెస్‌కు ఒరిగింది, లాభపడింది ఏం లేదు.. ఇక గత ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చూసిన కల్వకుంట్ల కవిత తాజాగా జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న సంగతి విదితమే.. కాగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆమెకు క‌నీసం పోటీకూడా ఇవ్వ‌లేక‌పోయాయి..

ఇక ఈ ఎన్నికల్లో కవిత పోటీ చేయడం ఖాయం అనుకున్నప్పటి నుండి నిజామాబాద్ గులాభి దళం కవిత గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా కవిత విజయం కోసం కృషి చేశారు. ఎన్నిక ఏకపక్షం కావడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళం ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రయోగించి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను భారీగా చేర్చుకుంది. కమలాన్ని అయితే కోలుకోలేని దెబ్బతీసింది.. ఇదిలా ఉండగా ఓడిన చోటే గెలుపును అందుకున్న కవిత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ గెలుపుతో కవిత తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టనున్నారట.

ఇకపోతే కేవలం 15 నెలల పదవీకాలం ఉన్న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి కవితను ఎంపిక చేయడం వెనుక రహస్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వీస్తున్న నేపధ్యంలో ఇదివరకే పూర్థిస్థాయిలో కొలువుతీరి ఉన్న మంత్రివర్గంలో ఆమెను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మంత్రివర్గంలో కేవలం 17 మందికే అవకాశం ఉంది. ఒకవేళ కవితను కేబినెట్‌లోకి తీసుకోవాలంటే ఎవరో ఒకరని తప్పించక తప్పదు. మరి కేసీయార్ ఎవరిపై వేటు వేస్తారన్నది రహస్యం.. అయితే కవిత కోసం ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ ఒక్కరిని తప్పించినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదంటున్నారు విశ్లేషకులు.. దీన్ని బట్టి చూస్తే కవిత గెలుపు గులాభి బాస్‌కు తలనొప్పిగా మారిందని అనుకుంటున్నారట ఆ పార్టీలోని కొందరు..