శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీల నడుమ హోరాహోరీ పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల తరపున బలమైన లీడర్లు తలపడుతున్నారు. అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడే రెండు పార్టీలు సమానంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు లీడర్లను తయారుచేసుకుంటున్నారు. రాజాం నియోజకవర్గం నుండి వరుసగా వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. మొదట టీడీపీలో ఉన్న ఆయన తర్వాత [ప్రజారాజ్యం, చివరకు వైసీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం నుండి టికెట్ పొందిన ఆయన మూడవస్థానంలో నిలిచారు. 2014లో వైకాపా నుండి పోటీచేసి విజయం అందుకున్నారు. అలాగే 2019లో కూడ గెలుపొందారు.
ఈయన గెలుపొందిన రెండు ఎన్నికల్లో 2014లో టీడీపీ నుండి కావలి ప్రతిభా భారతి పోటీచేయగా 2019లో కొండ్రు మురళీ మోహన్ బరిలో నిలిచారు. కొండ్రు మురళీ మీద సులువుగానే గెలిచారు కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ప్రతిభా భారతి మీద అంట ఈజీగా నెగ్గలేకపోయారు. తీవ్రమైన పోటీ నడుమ కేవలం 512 ఓట్లతో గట్టెక్కారు. గత ఎన్నికల్లో కొండ్రు మురళీకి కాకుండా ప్రతిభా భారతికే టికెట్ ఇచ్చి ఉంటే ఆమె గెలిచేవారని ఇప్పటికీ అక్కడి టీడీపీ శ్రేణులు అంటూ ఉంటారు. దళిత నాయకురాలిగా శ్రీకాకుళం జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్ గా మంచి పేరుంది ఆమెకు. శాసన సభ్యురాలింగ, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.
ఎలా చూసుకున్నా రాజాంలో కావలి కుటుంబానికి మంచి పట్టుంది. అందుకే ఈసారి ఆమె తన కుమార్తె గ్రీష్మను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. మొదట టీడీపీ నుండి టికెట్ అడిగి చూడాలని అనుకుంటున్నారు. ఎలాగూ కొండ్రు మురళీ యాక్టివ్ గా లేరు కాబట్టి టికెట్ కుమార్తెకు ఇస్తే గెలిపించుకుంటానని సంకేతాలు పంపుచున్నారట. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే వేరే పార్టీ నుండైనా ఏదీ కుదరకపోతే స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలపాలని భావిస్తున్నారట. వీటిలో ఏది జరిగినా కంబాల జోగులకు కష్టం ఎదురైనట్టే. ప్రతిభా భారతి కుటుంబాన్ని నిలువరించడం కష్టమైన పనే.
KeywordS: Kavali Pratibha Bharatrhi, Rajam, Srikakulam, Kavali Greeshma, Kambala Jogulu, YSRCP, TDP, కంబార్ అజోగులు, కావలి ప్రతిభా భారతి, కావలి గ్రీష్మ, టీడీపీ, వైసీపీ, శ్రీకాకుళం