Katrina Kaif And Vicky Kaushal: కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు కానీ ప్రేమలో ఎలా పడ్డారంటే?

Katrina Kaif And Vicky Kaushal: బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా వీరి ప్రేమను బయట పెట్టలేదు. ఈ క్రమంలోనే ఈ జంట డిసెంబర్ 9 వ తేదీ రాజస్థాన్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అవుతున్న నేపథ్యంలో పలువురు ఎన్నో సందేహాలను వ్యక్తపరిచారు.సాధారణంగా ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించినప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకుంటారు.

కానీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయినా వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి అనే అంశం గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పునాది పడింది కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్‌ అనే టాక్ షోలు వీరి ప్రేమ చిగురించిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ వీరి కుటుంబ విషయాలు కెరియర్ గురించి ముచ్చటించారు.

ఇలా ఈ షో ద్వారా పరిచయం ఏర్పడిన ఈ జంట అనంతరం వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ ప్రేమ బంధంలో ఉన్న వీరు డిసెంబర్ 9 వ తేదీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇలా వీరి ప్రేమకు ఎలాంటి సినిమాలు పునాది కాకుండా కేవలం కరుణ్ జోహార్ షో వీరి ప్రేమకి పునాది అని చెప్పవచ్చు. ఇక కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ వివాహానికి కేవలం 400 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తుంది. రేపటి నుంచి మెహందీ సంగీత్ వంటి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.