రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు.. చెన్నై తరలింపు

Kathi Mahesh met with an road accident
Kathi Mahesh met with an road accident
సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు గాయాలు ఎక్కువగానే అయ్యాయని తెలుస్తోంది.  మొదట్లో చిన్న చిన్న గాయాలే అన్నారు కానీ ఇప్పుడు మాత్రం పెద్దవేనని తెలుస్తోంది.  మొహం మీద, కంటికి తీవ్ర గాయాలు అయ్యాయట. 
 
ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కానీ కంటికి తీవ్ర గాయాలు కావడంతో సర్జరీ నిమిత్తం చెన్నైలోకి శంకర నేత్రాలయకు తరలిస్తున్నారట. ఇప్పటికైతే ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. సినీ విమర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన కత్తి మహేష్ కొన్ని సినిమాల్లో నటుడిగానూ చిన్న చిన్న పాత్రలు చేశారు.  కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ మీద, ఆయన అభిమానుల మీద విమర్శలు చేసి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారి మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యారు ఆయన.