Illegal Affair: తల్లి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న కూతురు.. అసలేం జరిగిందంటే?

Illegal Affair: తాజాగా కర్ణాటకలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తల్లి ప్రవర్తన నచ్చక టీనేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చిక్ మంగళూరు.. కదూర్ తాలూకా.. ఎస్ బారే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారింది.. అందరూ పనులకు వెళ్ళాలి అని సిద్ధపడుతున్నారు. ఇంతలో ఒక ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. దీంతో అందరూ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ టీనేజ్ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడికి వచ్చిన ఇరుగుపొరుగు వారికి ఆ అమ్మాయి ఆత్మహత్యకు కారణం ఎవరు అన్నది స్పష్టంగా తెలుసు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు కారణం ఆమె తల్లి. పూర్తి వివరాల్లోకి వెళితే..

లక్ష్మణ శెట్టి, లీలావతి దంపతులకు పూర్ణిమ అనే కూతురు ఉండేది. పూర్ణిమ రోజు స్కూల్ కి వెళ్లి బాగా చదువుకొని ఇంటికి వచ్చేది. ఇక పెద్దయ్యాక ఏమవుతావు అని అడగగా ప్రపంచమంతా తిరుగుతా అనేది. ఇక ఆమె టీచర్లు కూడా పైలెట్ అంటూ సలహా ఇచ్చారు. అదే దిశగా ప్రయాణిస్తూ రోజూ పైలెట్ ఎలా అవ్వాలి అని ఆలోచిస్తూ చదువు కొనసాగించేది. పూర్ణిమ తల్లిదండ్రులు చిన్న చితకా పనులు చేసుకునే బతికేవాడు. ఇది కరోనా మహమ్మారి రావడంతో కష్టాలు పెరిగాయి. పనులు సరిగా దొరకడం లేదు. ఇలాంటి సమయంలోనే లీలావతి తో ఆ ఊరిలో మంచి పేరు పలుకుబడి ఉన్న రంగస్వామి అనే వ్యక్తి సంబంధం ఏర్పరుచుకున్నాడు.

అతని దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఇక పూర్ణిమ, తండ్రి లక్ష్మణ శెట్టి లేని సమయంలో రంగస్వామి, లీలావతి ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు. అలా అతను ఇచ్చే డబ్బును లీలావతి ఇంటి అవసరాల కోసం ఉపయోగించేది. పూర్ణిమ స్నేహితులు తన తల్లి గురించి ఆమెకు చెప్పగా మొదట ఆమె నమ్మలేదు. ఇంటికి వెళ్లి తల్లిని ప్రశ్నించగా తల్లి మౌనంగా ఉండిపోయింది. ఇక అప్పటి నుంచి పూర్ణిమ, తల్లి లీలావతి ఎడబాటు గా ఉండేవారు. తల్లి ఏమి చెప్పినా కూడా పూర్ణిమ పట్టించుకునేది కాదు. భర్త లక్ష్మణ శెట్టి కూడా లీలావతి పద్ధతి మార్చుకోమని తరచు హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ లీలావతి తన తీరు మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలోనే పూర్ణిమ తోటి విద్యార్థులు అంటున్న మాటలు అనడం, తన తల్లి ప్రవర్తన మారక పోవడంతో జీవితంపై విరక్తి చెందిన పూర్ణిమ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీం కోర్టు కేసులో చెప్పిన విషయం అందరికి తెలిసిందే.