ఆయన ఓ జిల్లాకు బీజేపీ ప్రెసిడెంట్. ఆ జిల్లా బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాల్సినోడు కానీ.. ఆయనే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఎలా? తన అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని బీజేపీలోనే పని చేస్తున్న మహిళా కార్యకర్తను లొంగదీసుకున్నాడు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు ఆ మహిళను పిలిపించుకొని.. ఆ మహిళతో వికృత చేష్టలు చేసేవాడు. అసలే జిల్లా అధ్యక్షుడు.. ఎవరికైనా చెబితే ఇంకేమైనా ఉందా? అని భయపడిన ఆ మహిళ.. అతడు ఏం చేసినా ఇన్నేళ్లు భరించింది. కానీ.. ఇక తన వల్ల కాలేదు.. ఏమైనా కానీ అని అనుకుంది.. మనోడి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో కాదు… కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షడు బాస సత్యనారాయణ.
ఆయన ఆ మహిళతో చేసిన రాసలీలల వీడియోలు, ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మనోడి బాగోతం బీజేపీ హైకమాండ్ వరకు వెళ్లింది. ఆ మహిళతో ఆయన నగ్నంగా ఉన్న వీడియోలు, అతడితో మాట్లాడిన ఫోన్ కాల్స్ అన్నింటినీ ఆ మహిళ బయటపెట్టింది.
ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ.. ఆ మహిళ నోరు మూయించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. తన పలుకుబడి ఉపయోగించి… ఏకంగా కరీంనగర్ ఉన్నత పోలీస్ అధికారినే రంగంలోకి దించాడు. మహిళతో డీల్ సెట్ చేయమన్నాడు.
దీంతో బాధిత మహిళ.. తనకు 15 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. మనోడు చివరకు 9 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. డీల్ కు సంబంధించిన ఫోన్ కాల్స్ ను కూడా సదరు బాధిత మహిళ బహిర్గతం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ నేరుగా ఆ మహిళ ఇంటికే వెళ్లి.. తనపై దాడి చేసి ఫోన్ లాక్కున్నాడు. ఈ విషయం కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలియడంతో.. వెంటనే బాస సత్యనారాయణను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. వెంటనే కరీంనగర్ జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమించారు.
పార్టీలో ఉండాలంటే క్రమశిక్షణతో ఉండాలని.. ఇలాంటి పిచ్చి పనులు చేసి పార్టీ పరువు తీసేవాళ్లను పార్టీ ఎన్నటికీ సహించదు.. అని బండి సంజయ్.. హెచ్చరించారు.