మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ ఇంట పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆగ‌స్ట్‌లో తాను ప్ర‌గ్నెంట్ అనే విష‌యాన్ని ప్ర‌క‌టించిన క‌రీనా ఈ రోజు మ‌రో బేబికు జ‌న్మ‌నిచ్చింది. క‌రీనాకు బేబి బాయ్ జ‌న్మించాడ‌ని క‌రీనా కుటుంబ స‌భ్యులు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్నార‌ని మ‌రి కొద్ది రోజులల‌లోనే ఇంటికి పంప‌నున్నార‌ని పేర్కొన్నారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుప‌త్రిలో శ‌నివారం రాత్రి క‌రీనా అడ్మిట్ కాగా, ఈ రోజు డెలివ‌రీ అయింది.

2012లో క‌రీనా క‌పూర్, సైఫ్ అలీఖాన్‌లు వివాహం చేసుకున్నారు. సైఫ్ గ‌తంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్‌, ఇబ్రహీమ్‌ అలీఖాన్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు ఇండ‌స్ట్రీలో రాణించేందుకు కృషి చేస్తున్నారు. ఇక క‌రీనా, సైఫ్ దంప‌తుల‌కు 2016లో తైమూర్ అనే బుడ‌త‌డు జ‌న్మించ‌గా చిన్నారిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. అయితే కరీనాకు రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో తైమూర్‌కు తమ్ముడొచ్చాడంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

క‌రీనాకు కొడుకు పుట్టిన నేప‌థ్యంలో తైమూర్ పుట్టిన స‌మ‌యంలో క‌రీనా దిగిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తైమూర్‌ని చూసి కొత్త‌గా పుట్టిన చిన్నారి అని అంతా అనుకుంటున్నారు. అయితే క‌రీనా సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం అమీర్ ఖాన్ హీరోగా హాలీవుడ్ రీమేక్ చిత్రం లాల్ సింగ్ చ‌ద్దాలో న‌టిస్తుంది. ఈ మూవీ త‌ర్వాత తాక‌త్ షూటింగ్ లో పాల్గొన‌నుంది. ఇక సైఫ్ విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ చిత్రం భూత్ పోలీస్‌లో న‌టిస్తున్నాడు. అలానే ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న ఆదిపురుష్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో రావ‌ణాసురుడిగా క‌నిపించ‌నున్నాడు సైఫ్.