మరో తెలుగు హీరోని బాలీవుడ్ లో లాంచ్ చేస్తున్న కరణ్ జోహార్

కరణ్ జోహార్ అంటే ఒక బ్రాండ్. మార్కెటింగ్ లో కరణ్ జోహార్ ని మించినోళ్లు లేరు అనే టాక్ కూడా ఉంది. అయితే ఎక్కువగా స్టార్ కిడ్స్ ని సపోర్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్ట్స్ ని పైకి రానివ్వదని ఒక చెడ్డ రిమార్క్ కూడా ఉంది.

గత కొన్నాళ్లుగా కరణ్ జోహార్ సౌత్ సినిమా మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాని హిందీ లో మార్కెటింగ్ చేసిన కరణ్ ప్రస్తుతం ఒక టాలీవుడ్ యంగ్ హీరో ని బాలీవుడ్ కి పరిచయం చెయ్యబోతున్నాడు అని వార్త చక్కర్లు కొడుతోంది.

ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ముంబై లోని కరణ్ జోహార్ ఆఫీసులో నాగార్జున కనిపించారు. తాజా సమాచారం ప్రకారం  తన కొడుకు అఖిల్ బాలీవుడ్  ఎంట్రీ  విషయంలో నాగ్ ముంబైలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

కరణ్ జోహార్ త్వరలో అఖిల్‌ని హిందీలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, దాని కోసం ప్లాన్స్ జరుగుతున్నాయని హిందీ మీడియాలో గాసిప్ ఉంది. అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందో చూడాలి.