విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కాంతార’కు ఎదురుదెబ్బ తగిలింది. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే ‘వరాహ రూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌కు కాపీగా ‘వరాహ రూపం’ తీర్చిదిద్దారని పేర్కొంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ అనంతరం తాజాగా ఈ తీర్పు వెలువడింది. దీంతో, వారి అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్, ఇతర మ్యూజిక్స్ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. దీన్ని తెలియజేస్తూ థాయికుడమ్ బ్రిడ్జ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది