‘తలైవి’తో తమిళనాట పొలిటికల్ ఈక్వేషన్స్ మారతాయా.?

Kangana's Thalaivi Rises Political Heat In Tamilnadu

Kangana's Thalaivi Rises Political Heat In Tamilnadu

కంగనా రనౌత్.. పరిచయం అక్కర్లేని పేరిది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. నటిగానూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ కంగనా రనౌత్ పేరు తమిళనాట మార్మోగిపోతోంది. కారణం ఆమె నటించిన సినిమా ‘తలైవి’. త్వరలో విడుదలవుతోంది ఈ ‘తలైవి’ సినిమా. తాజాగా ట్రైలర్ విడుదలయ్యింది.. అసలే తమిళనాట పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిపోయింది.. ఎన్నికల నేపథ్యంలో. సరిగ్గా ఈ సమయంలోనే గురి చూసి వదిలుతున్నారు ‘తలైవి’ సినిమాని ఓ అస్త్రంలా. అందరికీ తెలిసిన విషయమే, కంగనా రనౌత్ పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తోందని.

ఆమె నటిస్తోన్న సినిమా.. అందునా బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే వ్యవస్థాపకురాలైన జయలలిత బయోపిక్ ‘తలైవి’. కావాల్సినంత పొలిటికల్ మసాలా ఈ సినిమాలో వుండబోతోంది. ట్రైలర్ ద్వారానే కొంత మసాలా తమిళనాట హీటెక్కించేలా వదిలేశారు. దాంతో, ఇప్పుడు ఎక్కడ విన్నా ‘తలైవి’ గురించిన చర్చే జరుగుతోంది. ‘ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ కూడా పాల్గొంటే బావుంటుందేమో..’ అన్న అభిప్రాయం అధికార అన్నాడీఎంకే వర్గాల్లోనూ, ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ఎంత ప్లానింగ్ చేసి వుండకపోతే.. ఎన్నికల వేళ ఇలాంటి సిత్రాలు తెరపైకొస్తాయట.? ప్రస్తుతానికైతే తమిళనాడులో డీఎంకే హవా వీస్తోందని అంతా అనుకుంటున్నారు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మారిపోవడానికి పెద్దగా సమయం అవసరంలేదేమో. కమల్ హాసన్ పార్టీ.. అసలు సోదిలోకి లేకుండా పోయిందిప్పుడు. అన్నట్టు, జాతీయ సినీ పురస్కారాలు కూడా తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసమే ఇచ్చారనే విమర్శలు కూడా వినిపిస్తుండడం మరో ఆసక్తికర అంశం.