కంగనా రనౌత్ ఫైర్ ఫైర్ ఫైర్..!

కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. హిందీ సీమలో ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా.. నట వారసురాళ్ళు వచ్చిన కంగన రనౌత్ ప్లేస్ ని రీప్లేస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే కంగనా రనౌత్ సినిమాలలో కూడా అంతే బిజీగా ఉంటోంది. కొన్ని కథలు బాలివుడ్ లో తన కోసమే తయారవుతున్నాయన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలని చూస్తుంటే. వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన కంగన తను నటిస్తున్న సినిమా విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.

కాగా కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. రజీ ఘైని దర్శకత్వంలో కంగనా రనౌత్ ‘ధాకాడ్’ అన్న సినిమా చేస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఏజెంట్ అగ్ని అన్న పాత్రలో కంగనా రనౌత్ కనిపించబోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఈ సినిమా నుంచి లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా అభిమానుల నుంచి .. ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరోసారి ఛాలెంజింగ్ రోల్ లో కంగన రాబోతోందని చెప్పుకుంటున్నారు.

కాగా కంగనా రనౌత్ తో పాటు ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, దివ్యదత్తా కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలలో అర్జున్ రాంపాల్, దివ్యదత్తా కూడా పాల్గొన్నారని సమాచారం. ఇక  తను ఈ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న కంగనా అభిమానులకు ఎల్లప్పుడూ ఇలా పోస్టర్స్ తో అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఇక కంగనా వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. త్వరలో కంగనా తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్ తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మేకోవర్ కోసం కంగనా చాలా కష్టపడింది. ఈ సినిమాతో పాటు తేజ్సా, మణికర్ణిక రిటర్న్స్ సినిమాలని .. అలాగే ఓ పొలిటికల్ డ్రామాలో ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర లో నటించబోతుందని తెలుస్తోంది.