బాలీవుడ్ కాంట్రవర్షియల్ నటి కంగనా రనౌత్ వైవిధ్యమైన సినిమాలతో ఎలా వార్తలలో నిలుస్తుందో , వివాదాలతోను అంతే హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మధ్య ముంబైను పీవోకేతో పోల్చి నానా రచ్చ చేసింది. ఇక ప్రస్తుతం జయలలిత జీవిత నేపథ్యంలో తలైవి అనే సినిమా చేస్తూ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ వచ్చింది. జయలలితగా కంగా అచ్చు దిగిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేశారు. మరో వైపు ధాకడ్ అనే యాక్షన్ చిత్రం కూడా చేస్తుంది. ఇక ఇప్పుడు దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తుంది.
అతి త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుండగా, తాజాగా ఇందిరా గాంధీగా కంగనా ఎలా ఉంటుంది అనే దానిపై టెస్ట్ షూట్ చేశారు. ఇందిరాగాంధీ మాదిరిగా హెయిర్ స్టైల్, వస్త్రధారణ సెట్ చేసి ఓ లుక్ కూడా వదిలారు. ఇందిరా గాంధీగాను కంగనా లుక్ అదరరహో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది జీవిత చరిత్ర కాదని, ఇందిరా గాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలకు సంబంధించి సినిమా రూపొందుతుందని కంగనా పేర్కొంది. తన స్నేహితుడు సాయి కబీర్‌తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది.
ఇందిరా గాంధీ జీవితంకు సంబంధించి తెరకెక్కనున్న ఈ చిత్ర కథ ఇప్పటికే పూర్తైందని, అతి త్వరలోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు కంగనా పేర్కొంది. ఓ పుస్తకం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రి పా్త్రలు కూడా కనిపించనున్నాయట. మరి వారి పాత్రలకు ఏఏ నటులని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది.