Emergency: కంగనా సినిమాపై రివ్యూ ఇచ్చిన సద్గురు.. ఏమన్నారంటే..

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీకి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసలు కురిపించారు. ఆయన ఇటీవల ఈ చిత్ర ప్రీమియర్‌ చూసి, ఈ సినిమా భారత చరిత్రను అద్భుతంగా పునఃసృష్టించిందని కొనియాడారు. యువత ఈ చిత్రాన్ని తప్పక చూడాలని, వారి దృష్టిలో భారతదేశ చరిత్రను సజీవంగా నిలబెట్టే అవకాశం ఇది అని అన్నారు.

సద్గురు తన అనుభవాలను పంచుకుంటూ, “ఎమర్జెన్సీ సమయంలో నేను యూనివర్సిటీ విద్యార్థిని. ఆ రోజుల్లో జరిగిన పరిణామాలు నా సమకాలీన అనుభవాలు. కానీ ప్రస్తుత యువతకు ఆ చరిత్ర తెలియదు. పాఠ్యపుస్తకాల్లోనూ ఆ కాలం గురించి తక్కువగా మాత్రమే చెప్పబడింది. ఈ చిత్రం ఆ లోటును తీర్చడంలో ముఖ్య పాత్ర పోషించగలదు” అని అభిప్రాయపడ్డారు. సినిమా భారతదేశ రాజకీయ, సామాజిక దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపించిందని ప్రశంసించారు.

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ తనదైన ముద్ర వేసిందని సద్గురు అన్నారు. కేవలం నటన మాత్రమే కాకుండా, దర్శకత్వ బాధ్యతలూ స్వయంగా చూసుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం అని ఆయన అభివర్ణించారు. “ఈ చిత్రానికి ఆమె అందించిన కృషి మెచ్చుకోదగినది. యువత తప్పనిసరిగా ఈ చిత్రాన్ని చూసి చరిత్రను అర్థం చేసుకోవాలి” అని అన్నారు. సద్గురు రివ్యూపై కంగనా స్పందిస్తూ, “సద్గురు వంటి వ్యక్తి నా చిత్రాన్ని చూసి ప్రశంసించటం నాకు అమూల్యమైన అనుభవం. ఇది నా హృదయాన్ని ఆనందంతో నింపింది” అని చెప్పారు. ఈ చిత్రం తన కెరీర్‌లో మరో మెట్టుగా నిలుస్తుందని, ప్రేక్షకులు దీనిని స్వీకరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

వాడి గుణమే గుడిసెటిది || Geetha Krishna Reveals Shocking Truth about Telugu Heroes || Telugu Rajyam