కన్ఫ్యూజన్లో కమల్ హాసన్

Kamal Hassan waiting for court verdict
Kamal Hassan waiting for court verdict
ఎలక్షన్ల హడావుడి ముగియడంతో కమల్ హాసన్ ఫ్రీ అయ్యారు.  సినిమాల మీద దృష్టి పెట్టారు.  ప్రజెంట్ ఆయన ముందు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  ఒకటి ‘ఇండియన్-2’ కాగా మరొకటి ‘విక్రమ్’.  వీటిలో శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్-2’ సగం పూర్తికాగా ‘విక్రమ్’ ఆరంభ దశలోనే ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ముందుగా మొదలుపెట్టాలనేదే పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ‘ఇండియన్-2’ లీగల్ సమస్యల్లో చిక్కుకుని ఉంది.  లైకా నిర్మాతలు ముందుగా ‘ఇండియన్ -2’ కంప్లీట్ చేసిన తర్వాతే శంకర్ వేరే ప్రాజెక్ట్ చేయాలని కోర్టుకు వెళ్లారు.  
 
శంకర్ సైతం ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశ్యంలోనే ఉన్నారు.  కోర్టు ఉత్తర్వుల కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నారు.  దీనికోసమే కమల్ హాసన్ సైతం వెయిట్ చేస్తున్నారు. కోర్టు అనుమతులు వచ్చి ‘ఇండియన్-2’ మొదలయ్యేలా ఉంటే డేట్స్ అన్నీ ఆ సినిమాకు ఇవ్వాల్సిందే. ఒకవేళ ముందుగా ‘విక్రమ్’కు డేట్స్ ఇస్తే అవి మార్చుకుని ‘ఇండియన్-2’కు ఇవ్వాల్సిందే. ఈ క్లాష్ అవాయిడ్ చేయడం కోసమే కమల్ హాసన్ కోర్టు ఉత్తర్వులను బట్టి డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారు.  లోకేష్ కనగరాజ్ కూడ కమల్ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నారు.  మరి కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.