విక్రమ్ సినిమా లాభాలతో మొత్తం తీర్చిన కమల్ హాసన్?

విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కమల్ హాసన్ ఎక్కువ తమిళ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితమైన వ్యక్తి. కమల్ హాసన్ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమల్ హాసన్ రీఎంట్రీ ఇచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ సందర్భంగా కమల్ హాసన్ సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక రక్తదాన శిబిరంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.” నేను తక్కువ సమయంలోనే 300 కోట్ల రూపాయలు సంపాదిస్తానని చెప్పినప్పుడు ఎవరు నమ్మ లేదు. కానీ.. ఇప్పుడు విక్రమ్ సినిమా ద్వారా ఆ మాట నిజం చేసి చూపించాను. విక్రమ్ సినిమా వల్ల వచ్చిన లాభాలతో మొత్తం అప్పులు అన్ని తీర్చేసి, నాకు నచ్చిన ఆహారం తింటూ.. అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసి హాయిగా గడిపేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇతరులకు సహాయం చేసినట్లు నటించాల్సిన అవసరం మాకు లేదు. పేరు ప్రఖ్యాతలు అవసరం లేకుండా ఒక మంచి మనిషిగా ఉంటే చాలు అని ఆశపడుతున్నాను..” అంటూ కమల్ హసన్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా విక్రమ్ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి నాటి నుండి ఇప్పటి వరకు కూడా భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా విక్రమ్ సినిమా దూసుకుపోతోంది. కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్‌ కమల్ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌పై తెరకెక్కించిన ఈ సినిమాకు లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వం వహించాడు . ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, ఫహద్‌ షాసిల్‌తో, హీరో సూర్య కూడా నటించాడు.