Kalyan Ram :బింబిసార గా వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈసారైనా హిట్ కొట్టేనా..?

Kalyan Ram :కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం బింబిసార నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కల్యాణ్‌ రామ్‌కు జోడిగా కేథరిన్, సంయుక్త మేనన్‌లు నటించారు. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతోంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.విజయమో, వైఫల్యమో – ఏదీ పట్టించుకోకుండా ప్రయోగాల చేస్తూనే వెళ్తుంటాడు కల్యాణ్ రామ్‌. కొత్త కథల్ని తెరకెక్కించడం అంటే తనకు భలే సరదా. ఇక ప్రొడ్యూసర్ గా మారి కిక్ 2 సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఇక యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలు కళ్యాణ్ రామ్ కు అంత సెట్ అవ్వవు అయిన ఇపుడు కత్తి పట్టి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఎంత సాహసం భారీ బడ్జెట్ తో సినిమా అవసరమా అనే టాక్ కూడా లేకపోలేదు.

బింబిసార కూడా అలాంటి ప్రయత్నమే. నందమూరి కళ్యాణ్ రామ్’ సినిమాల సెలెక్షన్ మొదటినుండి విభిన్నంగానే సాగుతుంది. ఒకసారి పటాస్ లాంటి సినిమా తీస్తే మరోసారి కళ్యాణ్ రామ్ కత్తి లాంటి సినిమా లు తీసారు. ఇలా అన్ని జోనర్ సినిమాలను ప్రయత్నిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో అయిన విజయం సాధిస్తారో లేదో చూడాలి. విజయం సాధిస్తే పర్వాలేదు కానీ మళ్ళీ ప్లాప్ అయితే పరిస్థితి ఏంటో ఆలోచించాలి.