Actress Kalpika: నటి కల్పిక పబ్‌ వివాదంలో వెలుగులోకి మరో కోణం.. అదంతా దానికోసమే చేసిందంటూ!

Actress Kalpika: ఇటీవల అనగా మూడు రోజుల క్రితం నటి కల్పిక పబ్ వివాదం సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. పబ్ యాజమాన్యం తనపై దాడి చేసినట్టు ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దర్యాప్తును కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటికి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మరో కోణం బయటకు వచ్చింది. కాగా ఇటీవల అనగా మూడు రోజుల క్రితం కల్పిక తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి లోని ప్రిజం పబ్‌ కి వెళ్లింది.

తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ కూడా చేసుకుంది. అయితే ఇందులో స్పెషల్‌ గా ఇచ్చే కాంప్లిమెంటరీ కేక్‌ విషయంలో ప్రిజం పబ్‌ సిబ్బందికి, కల్పికకి మధ్య చిన్న పాటి గొడవ జరిగింది. మాట మాట పెరిగి పెద్ద రచ్చ కూడా అయ్యింది. దీంతో తనపై పబ్‌ సిబ్బంది దాడి చేశారని, తనని డ్రగ్‌ అడిక్ట్ అంటూ దూషించారని ఆమె ఆరోపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా తనని అవమానించారంటూ కల్పిక ఆరోపణ చేస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేసింది.

అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా తనని అవమానించారని కల్పిక ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన కొత్త వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కల్పిక చేసిన రచ్చే ఎక్కువగా ఉంది. ఆమెనే ప్లేట్స్ విసిరేయడం, అక్కడి వస్తువులను పగలగొట్టడం కనిపించింది. అంతేకాదు పబ్‌ సిబ్బందిని దూషించినట్టుగా కూడా ఉంది. కల్పిక పబ్‌ బయట కారు ఆపి హల్‌చల్‌ చేసింది. దీంతో పబ్‌ సిబ్బంది ఆమెని సెల్‌ ఫోన్లలో వీడియోలు తీశారు. తీయండి తీయడం, ఫుల్‌గా తీయండి, అన్ని యాంగిల్స్ లో తీయండి అంటూ ఫైర్‌ అయ్యింది. మీకు కావాల్సింది అదే కదా మేడం అని సిబ్బంది అనగా, నాకు కావాల్సిందే అదే, నాకు కాంట్రవర్సీ కావాల్రా నాయనా అంటూ రెచ్చిపోయింది కల్పిక. ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగింది. అయితే ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఆ వీడియోలు చూసి నిజంగానే ఆమె పబ్లిసిటీ కోసం వార్తల్లో నిలవడం కోసం ఇలా చేసిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.