Rana Daggubati: కమల్ హాసన్ కన్నడ వివాదం సినిమా ఇండస్ట్రీలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. తమిళ భాష నుంచి కన్నడ పుట్టింది అనే మాట కన్నడిగులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో కన్నడిగులు ఆయనపై మండిపడడంతో పాటు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక కోర్టు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే కమల్ హాసన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని తన వాఖ్యలను తప్పుగా అపార్థం చేసుకున్నారని క్షమాపణ చెప్పను కావాలంటే తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయను అంటూ మొండి పట్టుకుని కూర్చున్నారు.
దీంతో థగ్ లైఫ్ సినిమాపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికీ కమల్ వెనక్కుతగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయాలని కోర్టుకెళ్లాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడుతారు అని కోర్టు నిలదీసింది. అప్పటికీ కమల్ క్షమాపణ చెప్పడం కాదుకదా అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. అయితే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఉంటే ఈ కన్నడ వ్యవహారం గురించి టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి స్పందించారు.
రానా నాయుడు రెండో సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో కమల్ హాసన్, కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్‌ఫామ్ గా సోషల్ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. ప్రతీది రాజకీయం చేస్తున్నారు అని అన్నారు రానా. ఈ సందర్భంగా రాణా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రానా వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. తన సినిమా విడుదల అయింది కానీ కమల్ హాసన్ మాత్రం ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు.