Allu Family: అల్లు ఫ్యామిలీలో గొడవలు… తట్టా బుట్టా సర్దుకుని బయటకు?

Allu Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య కుమారుడిగా ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలను తన గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక అల్లు అరవింద్ వారసుడుగా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అల్లు ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు కుటుంబంలో కూడా విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది.

ఇక అల్లు కుటుంబంలో విభేదాలు అంటే వాళ్ళు అరవింద్ ముగ్గురు కుమారులలో విభేదాలు చోటు చేసుకున్నాయి అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఎలాంటి సమయం సందర్భం వచ్చిన ఈ అల్లు వారసులు మాత్రం కలిసే ఉంటున్న సంగతి తెలుసు. అయితే అల్లు కుటుంబంలో ఒక్కరైనటువంటి నిర్మాత బన్నీ వాసు మాత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ 2 నుంచి బయటకు వచ్చేసారని తెలుస్తుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ 2 వ్యవహారాలను బన్నీ వాసు చూసుకుంటూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఇందులోకి అల్లు అరవింద్ బంధువు విద్యా కోప్పినీడు ఎంట్రీ ఇచ్చారు అప్పటినుంచి విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

సినిమాల విషయంలో కూడా పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఇది నచ్చని బన్నీ వాసు గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి బయటకు వచ్చేసారని సమాచారం. ఇలా గీత ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చిన ఈయన బన్నీ వర్క్స్ అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టు సమాచారం. ఇక పై ఈ బ్యానర్ నుంచి బన్నీ వాసు సినిమాలను చేయబోతున్నారని తెలుస్తోంది.