Kalpika Ganesh: తెలుగు సినీ నటి కల్పిక పబ్బు వివాదం సినిమా ఇండస్ట్రీలో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. గత నెల 29వ తేదీన కల్పిక పుట్టినరోజు కావడంతో తన స్నేహితులతో కలిసి ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. అయితే బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వహకులకు కల్పికకు మధ్య చిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే. చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలి వానగా మారింది. ఆమె తనపై పబ్బు నిర్వహకులు చేశారని అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారంటూ పబ్బులోని వస్తువులను పగలగొడుతూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియోలు ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆమె కావాలని కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేసింది అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలలో ఆమె కూడా అవును పబ్లిసిటీ కావాలి అందుకోసమే ఇదంతా చేస్తున్నాను. కాంట్రవర్సీ కావాలి వైరల్ కావాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఈ వ్యవహారం గురించి అనేక వార్తలు వినిపించాయి. ఇప్పుడే సద్దుమనుగుతుంది అనుకుంటున్న క్రమంలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
అదేంటంటే కల్పికపై మరో కేసు నమోదు అయింది. ఇన్ స్టా అకౌంట్లో అసభ్య కరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించిందంటూ కీర్తన అనే బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ బాక్స్ మెసేజ్ లు స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు ఆధారాలు సమర్పించింది సదరు బాధితురాలు. ప్రజం క్లబ్ వ్యవహారంపై ఇప్పటికే కల్పికపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు ఆమెపై నమోదు అయింది. ఈ వ్యవహారంపై కల్పిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఇకపోతే ఆమె కెరియర్ విషయానికి వస్తే.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్ 1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.