కాజల్ నెక్స్‌ట్ ప్లానింగ్ ఏంటో తెలుసా.?

Kajals Stunning Business Plans | Telugu Rajyam

చందమామగా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్, సరికొత్త అవతారానికి శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఆలోచనలో కాజల్ ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ కిచ్లూ అనే పెద్ద బిజినెస్ మేన్‌ని పెళ్లి చేసుకున్న కాజల్ ఆలోచన కూడా మెల్లగా బిజినెస్ వైపుకు మళ్లిస్తోందట.

ఇప్పటికే కాజల్, తన భర్త కిచ్లూతో కలిసి హోమ్ ఇంటీరియర్ బిజినెస్‌లో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకు మించి ఆలోచనలు చేస్తోందట. సినీ రంగంలో తాను సంపాదించిన సంపాదనను అక్కడే పెట్టుబడిగా పెడితే ఎలా ఉంటుంది.? అనే ఆలోచనలో భాగంగా నిర్మాతగా మారాలనుకుంటుందట.

సొంతంగా ఓ ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించే ఆలోచనలో కాజల్ ఉన్నట్లు తాజా సమాచారం. ఇక, హీరోయిన్‌గా కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ సరసన ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. వీటితో పాటు, మరి కొన్ని క్రేజీయెస్ట్ ప్రాజెక్టులు కాజల్ కోసం చర్చల దశలో ఉన్నాయట.

అయితే, వాటిల్లో కొన్ని ప్రాజెక్టులు తాత్కాలికంగా ఆగినట్లు తెలుస్తోంది. అందులో ‘ఇండియన్-2’ ఒకటి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles