కాజల్ ప్రెగ్నెన్సీ: తగ్గేదే లే.. కన్‌ఫామ్ చేయాల్సిందే.!

కరోనా కారణంగా దొరికిన సమయాన్ని సద్వినయోగం చేసుకున్న వారిలో చందమామ కాజల్ అగర్వాల్ పేరు ముందు లిస్టులో ఉంటుందని చెప్పొచ్చు. చక్కగా పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైపోయింది కరోనా కాలంలో కాజల్ అగర్వాల్. అనూహ్యంగా దొరికిన సమయాన్ని తన వైవాహిక జీవితంతో ముడిపెట్టుకుని, నాలుగు తీపి జ్ఞాపకాల్ని వెనకేసుకుంటోంది.

ఆ స్వీట్ మెమరీస్ ఎప్పటికపుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కీ షేర్ చేస్తోంది. ఇదే అదనుగా నెటిజనం.. కావచ్చు. కొన్ని రకాల మీడియా జనం కావచ్చు.. కాజల్‌కి ప్రెగ్నెన్సీ కూడా కన్‌ఫామ్ చేసేశారు. తాను ప్రెగ్నెంట్ అవునూ, కాదూ.. అనే విషయంలో కాజల్ రెస్పాండ్ కాలేదు కానీ, రేపో మాపో ఓ పాపనో, బాబునో కాజల్ చేతిలో పెట్టేసేలా ఉన్నారు.

ఓ పక్క ‘ఆచార్య’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, మిగిలిన ఇతర ప్రాజెక్టులు కూడా కాజల్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇన్ని కమిట్మెంట్స్ మధ్య కాజల్, తన ప్రెగ్నెన్సీ విషయంలో అంత నిర్లక్ష్యం వహిస్తుందా.? ఏమో మరి, తగ్గేదే లే.. అంటోన్న ఈ గాలి వార్తలు ఆగాలంటే, చందమామ నుంచి డైరెక్ట్ రెస్పాన్స్ రావాల్సిందే.