Kajal Aggarwal: ఘనంగా కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక… ఫోటోలు వైరల్!

Kajal Aggarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు. ఈమె నటించిన సీత సినిమా ద్వారా 50 సినిమాల మార్క్ దాటిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

2020 లో ఈమె తన చిన్ననాటి స్నేహితులు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ నువివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాల్లో కూడా నటించారు.ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న కాజల్ అగర్వాల్ ఉన్నఫలంగా తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకున్నారు. అందుకు గల కారణం ఈమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటించి ప్రస్తుతం తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈమె తన కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతం వేడుకలను జరుపుకుంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సీమంతం వేడుకలు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ అగర్వాల్ తన బేబీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.