Kacha Badam: కారు ప్రమాదంలో గాయపడిన కచ్చాబాదమ్ సింగర్.. అసలేం జరిగిందంటే..?

Kacha Badam: ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా కచ్చాబాదమ్ పాట మార్మోగిపోతోంది. ఈ కచ్చాబాదమ్ పాటతో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు భుబన్ బద్యాకర్. ఇది ఇలా ఉంటే ఇతను తాజాగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడు కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారు నేర్చుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతడి చాతికి, అదే విధంగా శరీరంలో పలు చోట్ల స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అతను సూరి సూపర్ అనే స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇతను పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. బీర్భూమ్ జిల్లాలో పల్లీలు అమ్ముకునే అతను కొనుగోలు దారులను ఆకర్షించడం కోసం ఈ పాటను కంపోజ్ చేసి పాడటంతో ఆ పాటను కాస్త యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దీనితో ఆ పాటకు దాదాపుగా 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి .