‎OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి షాకిచ్చిన కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

OTT: ఇటీవల కాలంలో సినిమాలు విడుదల అయిన నెల రోజుల్లోపే ఓటీటీలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ప్రతి ఒక్క సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. ఒకవేళ భారీగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయిన సినిమా ఒక వారం అటు ఇటుగా అయినా సరే నెల తర్వాత అయినా ఓటీటీ లోకి రావాల్సిందే. ఇలా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మానేసి ఓటీటీకే ‎పరిమితం అవుతున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో థియేటర్ లో విడుదల అయిన చాలా సినిమాలు ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి.

‎అలా తాజాగా కూడా ఒక సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏది అన్న వివరాల్లోకి వెళితే.. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ మూవీ జురాసిక్ వరల్డ్ రీ బర్త్. స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్ చేయగా, గారెత్ ఎడ్ వర్డ్స్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌ మూవీకు సీక్వెల్‌ గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నెల రోజులు తిరగకుండానే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో వీడియో ఆన్ డిమాండ్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

‎ అయితే ఇటీవల విడుదల అయిన ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి రావడంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ‎జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా విషయానికొస్తే.. గుండె జబ్బులు సహా మనిషి ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయం అయ్యేలా చేసే శక్తి మూడు అరుదైన డైనోసార్ల రక్తంతో చేసిన ఔషదానికి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. కానీ బతికున్న వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ప్రయోగానికి ఉపయోగపడుతుంది. దీంతో అడ్వెంచర్‌ ఆపరేషన్స్‌ చేసే జోరా బెన్నెట్‌తో, మార్టిన్ అనే ఫార్మాస్యూటికల్స్‌ ప్రతినిధి ఒప్పందం చేసుకుంటాడు. ఈక్వెడార్‌ లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్‌ హెన్రీ, బోటు యజమాని, సాహసీకుడు డంకన్‌ అందరూ కలిసి ప్రయాణిస్తారు. అయితే ఆ తర్వాత ఏమైంది? డైనోసార్ల నుంచి రక్తం సేకరించారా లేదా? చివరికి ఏం జరిగింది అన్నది ఈ సినిమా అసలు కథ.