NTR: ఆమె మాటలు నన్ను ఎంతగానో కదిలించాయి… ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎన్టీఆర్!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వరుస షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న నేపథ్యంలో మరోవైపు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఈయన జపాన్ లో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా జపాన్లో ఎన్టీఆర్ కి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది.అక్కడ అభిమానుల కలిసి ముచ్చటించిన ఎన్టీఆర్.. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. తాజాగా X వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

నేను ఎప్పుడు జపాన్ వెళ్లినా నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తాయి.. కానీ ఒక సందర్శన మాత్రం నాకు ఎప్పటికి గుర్తిండిపోతుంది. ఒక జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పాడు. ఆ మాట నిజంగా నన్ను కదిలించింది. ఒక కల్చర్‌కు, ప్రేమకు సినిమా ఈరోజు వారధిగా నిలిచింది. అందుకే ఓ అభిమానిని సినిమా శక్తి భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించింది. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. భారతీయ సినిమా ప్రపంచాన్ని పర్యటించేందుకు ఇది ఒక నిదర్శనం అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక నేడు మార్చి 28వ తేదీ దేవర సినిమా జపాన్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా అక్కడ జపాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించి సందడి చేశారు.