కరోనా వైరస్ తో ముందుంది ముసళ్ల పండగా అన్నది అందరికీ తెలిసిందే. జూన్ నుంచి భారత్ లో వాతావరణం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అసలైన కరోనా విజృంభణ అప్పటి నుంచి మొదలవుతుందని ఇప్పటికే నివేదికలు చెబుతున్నాయి. తాజాగా జూన్ లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా ఒకసారి వచ్చిందని నిర్లక్షంగా ఉండొద్దని మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉందని మరోసారి ఉద్ఘాటించారు. దేశం ఆర్ధిక సంక్షభంను ఎదుర్కునేందుకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాల్గవ దశ లాక్ డౌన్ 4.0 అమలులో ఉంది.
మరో వారం రోజుల్లో ఆ లాక్ డౌన్ గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా? యథేశ్చగా వదిలేస్తారా? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇరాన్, స్పెయిన్, బ్రిటన్ దేశాల పరిస్థితి ఓసారి పరిశీలిస్తే! భారత్ కు ఇలాంటి ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. మార్చి నెలలో ఇరాన్ లో భారీ స్థాయిలో కరోనా కేసులు పెరిగాయి. కట్టడిలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినం చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ లో కేసులు తగ్గాయి. దీంతో మళ్లీ అక్కడి ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. అయితే మళ్లీ రెండవసారి అక్కడ కరోనా పంజా విసురుతోంది. అలాగే స్పెయిన్, బ్రిటన్ , దక్షిణ కొరియా దేశాలు కూడా ఇలాగే పట్టు..విడుపులిచ్చాయి.
దీంతో అక్కడ మళ్లీ కరోనా దాడి చేస్తోంది. దీంతో ఇప్పుడు భారత్ 4.0 తర్వాత తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ర్టాలు లాక్ డౌన్ నుంచి సండలింపులు ఇచ్చాయి. దీంతో కేసులు సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్, స్పెయిన్ దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుందా? అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇంతకు మంచి లాక్ డౌన్ పొడిగిస్తే దేశంలో దారుణమైన పరిస్థితులు తలెత్తాయన్నది మరో వైపు హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వర్షాకాలం ప్రారంభానికి ముందే డెంగీ, మలేరియా కేసులు గతేడాది ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో యద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.