Jr NTR: జూ.ఎన్టీఆర్ సెట్లో మాతోనే కలిసి భోజనం చేసి తన సఫారీలో చెప్పేవాడు.. నటుడు రాజేంద్ర చౌదరి!

Jr NTR: కొందరు పట్టిందల్లా బంగారమవుతుంది. కానీ తన విషయంలో మాత్రం అలా జరగలేదని నటుడు రాజేంద్ర చౌదరి అన్నారు. కొందరనుకుంటారు ప్రయత్న లోపం కారణం కావచ్చు అని, అని తాను అన్ని విధాలా ప్రయత్నం చేశానని, ఎంతో మందిని సంప్రదించానని, ఎక్కడెక్కడో తిరిగానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రారంభంలో మంచి వేషాలే వచ్చాయని, రాను రాను ఎలా అయిపోయిందంటే హీరో, హీరోయిన్లతో పాటు ప్రతీ క్యారెక్టరూ పర రాష్ట్రం వాళ్లే కావాలన్నట్టుగా మారిపోయిందని ఆయన చెప్పారు. మనం ఎక్కడా కనిపించట్లేదని, అసలు అలా ఎందుకు మారిపోయిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే తాము పనికిరామనా అంటే అది కూడా లేదు కదా, తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి టాలెంట్ ఉన్న టెక్నిషియన్స్ ఉన్నారని, కానీ వాళ్ల టాలెంట్‌ను ఉపయోగించుకోవడం లేదని ఆయన చెప్పారు. ప్రతీ దానికి వేరే రాష్ట్రం వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు.

ఇలా తానే కాదు ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారని రాజేంద్ర చెప్పారు. కొంత వయసు వచ్చాక అప్పటివరకు చేసిన వేషాలు కూడా ఇవ్వరని, దానికి కారణం వాళ్లు ఇంతకుముందు చేసిన పాత్రలే అని ఆయన తెలిపారు. ఇలా అయ్యేసరికి తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయన్న ఆయన, అందుకే సీరియల్స్‌లో చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే తనకు 20 ఏళ్ల అనుభవం ఉన్నా ప్రస్తుతం గొప్పగా అవకాశాలేమీ లేవని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు పాపులర్ అవుతారో, ఎప్పుడు బిజీ అవుతామో ఊహించలేమని ఆయన అన్నారు. ఏదో ఒక రోజు ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతోనే కాలం గడుపుతూ ఉంటామని ఆయన తెలిపారు. తనకు వ్యాపారం గానీ, ఉద్యోగం గానీ, ఆస్తులు గానీ లేవని కేవలం ఆ కళామతల్లినే నమ్ముకొని ఉన్నానని, అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా ఆది సినిమా చేస్తున్నపుడు హీరో ఎన్టీఆర్ తమతో చాలా సరదాగా ఉండేవారని ఆయన చెప్పారు. హీరో అనే గర్వం లేకుండా తమతో కలిసి తినేవాడని, కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉండేవారమని రాజేంద్ర తెలిపారు. సఫారీలో కూడా తిరిగేవారమని ఆయన అన్నారు.