టీడీపీకి జూ.ఎన్టీయార్ మాత్రమే దిక్కట.. వస్తాడా మరి.?

Jr NTR is only the Hope For TDP

NTR and Chandrababu

తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీయార్ మాత్రమే దిక్కు.. అని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. నిజానికి, ప్రస్తుత రాజకీయాల్లో రాణించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమా గ్లామర్ ఒక్కటే వుంటే సరిపోదని ప్రజారాజ్యం పార్టీ విషయంలోనూ, జనసేన పార్టీ విషయంలోనూ నిరూపితమ్యింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో జూనియర్ ఎన్టీయార్‌ని పోల్చిచూడటం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కొన్నాళ్ళ క్రితం జూనియర్ ఎన్టీయార్ కూడా టీడీపీ తరఫున ప్రచారం చేసినా అది టీడీపీకి పెద్దగా ఉపయోగపడలేదనే విషయాన్ని ప్రస్తావించుకోవాల్సిందే. కానీ, జూనియర్ ఎన్టీయార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి అవసరం. అయితే, చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా.? అన్నదే ప్రశ్న.

స్వర్గీయ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిస్తేనే టీడీపీ, చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. అలా అక్రమంగా పార్టీని లాగేసుకున్న చంద్రబాబు, క్రమక్రమంగా టీడీపీని కూడా వెన్నుపోటు పొడిచేస్తూ వచ్చారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిపోయినట్లే. తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లలో టీడీపీ నాశనమైపోయింది. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తే, ఆయనా తన పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది తప్ప, ఆయన వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం వుండకపోవచ్చు. ‘దయచేసి రాజకీయాల్లోకి రావొద్దు..’ అని తమ అభిమాన నటుడ్ని ఉద్దేశించి జూనియర్ ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బతిమాలుకుంటున్నారు. బాలయ్య టీడీపీలో వున్నా, లేనట్టే. ఆయన వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేదు సరికదా, అభిమానుల్ని కొట్టడం ద్వారా పార్టీని మరింత భ్రష్ట్టుపట్టించేస్తున్నారాయన.