Ntr: మరోసారి రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించబోతున్నారా అంటే అవుననే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో RRR సినిమా విడుదలయ్యి అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో మరో బయోపిక్ సినిమా రాబోతుందనీ ఇటు బాలీవుడ్ మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ ఈ వార్త కోడై కూస్తుంది.భారతీయ సినిమా ‘పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే’ బయోగ్రఫీలో టైటిల్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వార్తలు జోరుగా వినపడుతున్నాయి.
సుదీర్ఘ చర్చల అనంతరం.. ఎన్టీఆర్ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే చేసిన విశేష సేవల ఆధారంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది ఆయన పేరుతో సినీ సెలబ్రిటీలకు అవార్డులను ప్రకటిస్తూ గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్ జక్కన్న కాంబోలో రాబోతున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చిత్రం గురించి ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ తన సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈయన ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా షూటింగ్ పనులలో భాగమయ్యారు .ఇక ఈ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్లో దేవర 2 కూడా ఈయన చేయబోతున్న విషయం తెలిసిందే.