Ntr: బిర్యానీ తర్వాత ఎన్టీఆర్ ఎక్కువగా ఇష్టపడే వంటకం అదేనా… మరీ అంత ఇష్టమా!

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి భోజనం ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే .ముఖ్యంగా నాన్ వెజ్ కనుక ఉంటే ఈయన ఏమాత్రం ఆగరని చెప్పాలి తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో స్వయంగా ఎన్టీఆర్ తన ఇష్టమైన వంటకాల గురించి మాట్లాడారు. ఇలా బిర్యాని చూస్తే తన మనసు ఆగదనే చెప్పాలి అయితే తినడం వరకు మాత్రమే కాదండోయ్ వంట చేయడంలో కూడా ఈయనకు మించిన వారు లేరనే చెప్పాలి.

ఎన్టీఆర్ ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలను చాలా అద్భుతంగా చేస్తారట కొన్ని సందర్భాలలో తన భార్య ప్రణతి మీ చేత ఒక రెస్టారెంట్ పెట్టిస్తే బాగుంటుంది అంటూ కూడా ఆట పట్టిస్తుందని స్వయంగా తారక్ ఓ సందర్భంలో తెలిపారు. ఎన్టీఆర్ కు బాగా కోపం వస్తే కనుక వెంటనే కిచెన్ లోకి వెళ్లి బిర్యానీ చేయటంపై మనసు పెడతారని తద్వారా తన కోపం తగ్గించుకోవడమే కాకుండా తనకి ఎంతో ఇష్టమైన బిర్యాని కూడా తిన్నట్టు ఉంటుందని వెంటనే కిచెన్ లోకి వెళ్లి బిర్యానీ చేయడం మొదలు పెడతారట.

ఇలా తారక్ వంట గదిలో ఉన్నారంటే కచ్చితంగా తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇంటికి వచ్చి తన చేతి వంట రుచి చూడాల్సిందే. ఇలా నాన్ వెజ్ ఎంతో అమితంగా ఇష్టపడే ఎన్టీఆర్ బిర్యాని కాకుండా ఎంతో ఇష్టంగా తినే మరో ఆహార పదార్థం ఉందని తెలుస్తుంది. అది మరేదో కాదు హలీం అనే చెప్పాలి రంజాన్ మాసం కావడంతో ఎక్కడ చూసినా హలీం మనకు లభిస్తుంది అయితే ఇది రంజాన్ మాసంలో దొరుకుతుంది కనుక ఎంతోమంది ఇష్టంగా తింటూ ఉంటారు.

ఇక ఎన్టీఆర్ మాత్రం రంజాన్ మాసం కోసం ఎదురుచూడరట తనకి కనుక తినాలి అనిపిస్తే వెంటనే తనకి ఇష్టమైన చికెన్ మటన్ హలీం స్వయంగా తయారు చేసుకుని తింటారట. బిర్యానీ తర్వాత ఆయన అంతలా ఇష్టపడే వంటకం ఏదైనా ఉంది అంటే అది హలీమ్ అని చెప్పాలి. ఇక ఈయన వంట చేస్తే తన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా తన స్నేహితుల కోసం కూడా వంట చేసి వారికోసం ప్రత్యేకంగా పంపిస్తుంటారని చెప్పాలి.