Jr NTR Crazy Project : ఇంకా లైవ్ లోనే ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్..ఆస్కార్ విన్నర్ కూడా రెడీ అట.!

Jr NTR Crazy Project :  టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు తన లైన్ లో పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆల్రెడీ ట్రిపుల్ ఆర్(RRR) అనే సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకొని పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ కూడా తాను తెచ్చుకున్నాడు.
అయితే ఎన్టీఆర్ నటించనున్న ఇతర సినిమాల్లో ఇప్పుడు దర్శకుడు కొరటాలతో భారీ సినిమా ఓకే కాగా దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా ఒకటి. అయితే వీటి తర్వాత దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా ఉందని ఆ మధ్య అంతా బాగానే ప్రచారం జరిగింది కానీ తర్వాత సైలెంట్ అయ్యింది.
అయితే లేటెస్ట్ గా మాత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా పనులు ఆల్రెడీ జరుగుతున్నాయని ఒక టీం కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
అలాగే ఈ ఈ భారీ సినిమాకి ఇండియాస్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి ఫిక్స్ అయ్యినట్టు కూడా సినీ వర్గాల్లో కన్ఫర్మ్ అయ్యిపోయింది.
దీనితో ఎన్టీఆర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇంకా లైవ్ లోనే ఉన్నట్టుగా అందరిలో క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమా అయితే మొదలు కావడానికి కాస్త సమయం పడుతుంది ఎలా లేదన్నా మూడు నాలుగు ఏళ్ళు తప్పదు.