‘Attack’ Terrific Trailer : సూపర్ సోల్జర్ గా జాన్ అబ్రహాం ‘ఎటాక్’ టెర్రిఫిక్ ట్రైలర్!

‘Attack’ Terrific Trailer : అతీత శక్తులున్న సూపర్ సోల్జర్ గా స్వదేశాన్ని రక్షించడానికి జాన్ అబ్రహాం వచ్చేస్తున్నాడు…సత్యమేవ జయతే లో వీర దేశభక్తి గల పోలీసాఫీసర్ గా యాక్షన్ లోకి దిగిన జాన్ అబ్రహాం, ఇక ఎటాక్ తో బాక్సాఫీసుని విభిన్నంగా ఎటాక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. విభిన్నంగా ఎలాగంటే, సోల్జర్ గా తనకి మానవాతీత శక్తులుంటాయి. టెర్రరిస్టులతో సైనికులు, పోలీసులు పోరాడే అనేక సినిమాలొచ్చాయి గానీ, ఇలా సూపర్ నేచురల్ పవర్స్ వున్న సిల్జర్ టెర్రరిస్టుల్ని అంతమొందించే మూవీ రావడం ఇదే ప్రథమం.
   

జాన్ తన జీవిత తత్వశాస్త్రాన్ని పఠించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. “మీ జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి. మీరు పుట్టిన రోజు, మీరెందుకు పుట్టారో తెలుసుకున్న రోజు అన్న డైలాగ్ తో తల్లి పాత్రలో రత్నాపాఠక్, హీరోయిన్ పాత్రలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ పరిచయమవుతారు. తర్వాత జాన్ ఒక లేబొరేటరీలో తన రక్తంలోకి సూపర్ సీరం ఎక్కించుకునే దృశ్యం వస్తుంది. ఆ సూపర్ సీరం తో సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. ఇక ఎటాక్ మీద ఎటాక్!

సూపర్ నేచురల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ వూహకందని సూపర్ యాక్షన్ బిట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ట్రైలర్‌కి హైలైట్ అంటే ఖచ్చితంగా యాక్షన్ బిట్సే. ట్రైలర్‌లో ఫ్రెష్ నెస్  ఏమిటంటేఈ యాక్షన్ బిట్స్ కిచ్చిన స్పెషల్ ఎఫెక్ట్సే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే. హిందీ ట్రైలర్స్ కొత్తదనం తో వస్తున్నాయి. షారూఖ్ ఖాన్ పఠాన్ ట్రైలర్ కూడా ఇలాటిదే.

 ఎటాక్ లో జాన్ అబ్రహాం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్రత్నా పాఠక్ లతో బాటు రకుల్ ప్రీత్ సింగ్ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ ఈ సూపర్ యాక్షన్ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి ట్రైలర్ చూసేయండి.

Attack | Official Trailer | John A, Jacqueline F, Rakul Preet S | Lakshya Raj Anand| April 1st, 2022