చంద్రబాబు కొట్టిన దెబ్బకు ఆ ‘రెడ్డి’ కుటుంబానికి నిద్ర కూడ పట్టట్లేదట !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులకు కాదు అప్పుడప్పుడు సొంత పార్టీ మనుషులకు కూడ మాస్టర్ స్ట్రోక్స్ ఇస్తుంటారు.  ఆయన స్ట్రోక్ తగిలి గల్లంతైనవారు ఎందరో ఉన్నారు.  ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి మరొక కుటుంబం చేరబోతోంది.  అనంతపురం తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూడబోతే అలానే ఉంది.  అంమాతాపురం రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబాల్లో జేసీ ఫ్యామిలీ కూడ ఒకటి.  తాడిపత్రి నియోజకవర్గం కేంద్రంగా జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రాజకీయాలకు శాసించారు.  కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.  ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. 

JC family upset with Chandrababu Naidu’s decision

కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ మూతబడిందో అన్నదమ్ములిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.  ఆ చేరికే వాళ్ళ రాజకీయ పతనానికి నాంది అయింది.  2014లో జేసీ ప్రభాకర్ ప్రభాకర్ తాడ్రిపత్రి నుండి ఎమ్మెల్యేగా, జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం లోక్ సభ స్థానం నుండి ఎంపీగా గెలిచారు.   కానీ 2019 ఎన్నికల నాటి నుండి వారి పరిస్థితి తారుమారైంది.  అన్నదమ్ములిద్దరూ తప్పుకుని వారి వారి వారసుల్ని తెరపైకి తెచ్చారు.  అనంతపురం లోక్ సభ స్థానం నుండి దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్, తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుండి ప్రభాకర్ రెడ్డి  కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీచేసి ఓడిపోయారు.  దీంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో వారి ప్రాభవం తగ్గిపోయింది. 

JC family upset with Chandrababu Naidu’s decision

దానికితోడు తాజాగా ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అక్రమ వాహనం రిజిస్ట్రేషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టయ్యారు.   ఇలా ఇబ్బందులుపడుతున్న వారికి పార్టీ పెద్దగా అండదండలు ఇవ్వాల్సిన చంద్రబాబు మూలిగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా జిల్లా రాజకీయాల్లో ప్రాముఖ్యత తగ్గించేశారు.  తాజాగా ఆయన ప్రకటించిన పార్లమెంటరీ అధ్యక్షుల్లో అనంతపురం నుండి కాల్వ శ్రీనివాసులుకు పదవి ఇచ్చారు.  గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓడిన పవన్ కుమార్ రెడ్డిని కనీసం పట్టించుకోలేదు.  అసలు ఈ పదవి విషయమై జేసీ కుటుంబాన్ని బాబు సంప్రదించలేదని అంటున్నారు.  ఈ ఘోర పరాభవంతో జేసీ బ్రదర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చూడబోతే వచ్చే ఎన్నికల్లో బాబు టికెట్ కూడ ఇవ్వరనే అభిప్రాయానికి వచ్చేశారని జిల్లాలో టాక్ నడుస్తోంది.