బెల్లీ డాన్స్ తో రెచ్చిపోయిన జ్జాతిరత్నాలు బ్యూటీ.. వీడియో వైరల్ ..!

డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన జాతి రత్నాలు ఫరియా అబ్దుల్లా సినిమాలో కథానాయక పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తర్వాత బంగార్రాజు సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాటలో కూడా ఈ అమ్మడి డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అయితే తనకు డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఫరీయా అబ్దుల్లా ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తరచు డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు మరొక డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఎప్పుడు మోడరన్ స్టెప్పులతో సందడి చేసే చిట్టి ఈసారి మాత్రం కొత్తగా బెల్లీ డాన్స్ తో రెచ్చిపోయింది. ఈ బెల్లీ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ చిట్టి డాన్స్ కి ఫిదా అయ్యాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సినిమాల్లోకి రాకముందు ఒక మోడల్ గా, థియేటర్ ఆర్టిస్టుగా, యూట్యూబర్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తెలుగులో జాతి రత్నాలు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. సినిమాలలోకి రాకముందు ఫరియా అబ్దుల్లా నక్షత్రా అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగారు రాజు వంటి సినిమాలలో నటించిన ఈ అమ్మడు తమిళ్ లో కూడా వల్లి మయిల్ అనే సినిమాలో నటించింది.